ఏప్రిల్ 16, 2021

నవలల పోటీ: సహరి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 10:30 ఉద. by వసుంధర

ఏప్రిల్ 13, 2021

కథల పోటీ ఫలితాలుః కథా విజయం

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 7:02 సా. by వసుంధర

రెండు ఉగాది వెబ్ సంచికలు

Posted in కథల పోటీలు, కవితల పోటీలు, మన పత్రికలు, సాహితీ సమాచారం at 12:04 సా. by వసుంధర

 1. సహరి

అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 💐💐💐
నూతన సంవత్సర కానుకగా ఈ వారం సహరి మీకు ఉచితంగా అందచేస్తున్నాము. ఈ క్రింద ఇచ్చిన లంకెలో సహరి చదవండి. మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి.

http://guest.sahari.in/1617892600/09-04-2021/

2. కథామంజరి

ఈ క్రింద ఇచ్చిన లంకెలో కథామంజరి చదవండి

www.kathamanjari.in/files/ugadi.pdf

చారిత్రక నవలా రచన పోటీ

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 11:45 ఉద. by వసుంధర

డాలస్ వాసి, శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారి సౌజన్యంతో….
వారి తల్లిదండ్రులు – జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక
సిరికోన ఉత్తమ చారిత్రక నవలా రచన పోటీ
(రూ.25,000విలువ గలది)

నిబంధనలు- విధాన వివరాలు:

 1. అనాది కాలం నుంచి, స్వాతంత్ర్యోద్యమ కాలం వరకు
  ఏ నాటిదైనా, తెలుగువారికి సంబంధించిన
  చారిత్రక ఇతివృత్తమై ఉండాలి!
 2. ముద్రణలో రెండు వందల పుటలకు తగ్గరాదు.
 3. పోటీ ఫలితాలు వెలువడిన వెంటనే రూ. 10,000/ విజేత
  అకౌంటుకు పంపబడుతుంది. ముద్రిస్తున్నప్పుడు ఆ పై వ్యయం
  గరిష్టంగా రూ.15,000/-కు మించకుండా అందజేయబడుతుంది.
 4. లోన రెండో అట్ట మీద పురస్కారప్రదాత తల్లిదండ్రుల పేర్లు,ఫోటో,
  వారి స్మారక పురస్కారవిజేత రచన అని ప్రచురించవలసి
  ఉంటుంది. అంకితం మాత్రం తమ అభీష్టం ప్రకారం ఇచ్చుకోవచ్చు.
 5. రచనపై హక్కులు రచయితకే ఉంటాయి. అయితే ఎపుడు
  పునర్ముద్రించినా రెండో అట్టపై పై స్మారక పురస్కార వివరాలను
  ఫోటో సహితంగా ముద్రించవలసి ఉంటుంది.
 6. బహుమతి పొందిన నవలను సిరికోన భారతిలో సీరియల్ గా
  ముద్రించటం జరుగుతుంది. 2021 చివరివరకు పుస్తకరూపంలో
  తప్ప, మరెందులోనూ నవలను సీరియల్ గా ముద్రించకూడదు.
 7. పురస్కార నిర్ణయంలో న్యాయనిర్ణేతలదే తుది తీర్పు!
 8. రచనలు పంపడానికి ఆఖరు తేదీ― 31 జులై 2021.
  రానున్న ఆగస్ట్15 కున్న ప్రత్యేకత రీత్యా ఆ తేదీన ఫలితాలు
  వెల్లడింపబడుతాయి.
 9. సిరికోన లోని రచయిత్రులు/ రచయితలే కాక ఇంకెవరైనా
  ఇందులో పాల్గొనవచ్చు! వీలైనంత ఎక్కువ మంది సిరికోన రచయితలు ఈ పోటీలో పాల్గొంటూ, ఈ వార్తను ఎక్కువమందికి అందేలా చూడాలని విజ్ఞప్తి!

ఏప్రిల్ 12, 2021

ఉగాది ఉత్తమ రచనల పోటీ ఫలితాలుః వంగూరి ఫౌండేషన్

Posted in ఇతర పోటీలు, కథల పోటీలు, కవితల పోటీలు, సాహితీ సమాచారం at 8:58 సా. by వసుంధర

తరువాతి పేజీ