సెప్టెంబర్ 14, 2021

సరస కథల పోటీలు

Posted in కథల పోటీలు at 7:45 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

శృతి మించని శృంగారం రతీదేవి నుదుటన సిందూరం!

తెలుగు సొగసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న E T రామారావు స్మారక సరస కథల పోటీకి ఆహ్వానం..

మీ కథలను మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు, యూనికోడ్ లో పేరాల మధ్య గ్యాప్ తగినంతగా ఇస్తూ టైపు చేసి telugusogasu.poteelu@gmail.com మెయిల్ అడ్రస్ కి పంపగలరు.

బహుమతులు:

మొదటి బహుమతి : రూ: 1200 రెండవ బహుమతి : రూ: 800 మూడవ బహుమతి :రూ:500
ప్రత్యేక బహుమతులు (8) : ఒక్కింటికి రూ: 300 చొప్పున. 

రచనల ఎంపిక విషయంలో తెలుగు సొగసు సంపాదక వర్గానిదే తుది నిర్ణయం. వాద, ప్రతివాదాలకు తావు లేదు.

హామీ పత్రంతో మీ కథలు చేరవలసిన చివరి తేదీ : 30.10.2021

 వివరాలకు

9440407381

సెప్టెంబర్ 12, 2021

పిల్లలకు కథల పోటీలుః బాల బాట

Posted in కథల పోటీలు, కవితల పోటీలు, సాహితీ సమాచారం at 11:47 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

బాలబాట బాలల మాసపత్రిక పిల్లల రచనలకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తోంది.


నిబంధనలు


 1. పిల్లలు వ్రాసిన”కధ” “కవిత” విభాగాలలో ఉభయ తెలుగు రాష్ట్రాల పిల్లలు పాల్గొనవచ్హును.
  2) A4సైజు తెల్లకాగితానికి ఒకప్రక్క మాత్రమే స్వదస్తూరీ తో వ్రాయాలి.
  3) రచన వ్రాసిన కాగితం పైన పేరు వివరాలు ఏమీ వ్రాయ కూడదు. జతచేసిన హామీపత్రం
  మీద ఫొటో, చిరునామా, ఫోన్ నెంబర్ వ్రాస్తూ, వ్రాతప్రతి తో 2 జెరాక్సు కాపీలు జత చేయాలి.
  4) రచనలు అందవలసిన చివరి తేది నవంబర్ 14.
  5) విజేతలు స్వయంగా సభకువచ్హి బహుమతులను, ప్రశంసా పత్రాన్ని అందుకోవలెను.
  6) రచనలు అందవలసిన చిరునామాః
 2. ఎడిటర్, బాలబాట
  ఇం.నం. 7-1-67/3, చిన్నవల్టైర్ మసీదు ఎదురుగా,
  కోటక్ మహేంద్ర బ్యాంకు పక్కన
  విశాఖపట్నం-17
  ఇతర వివరాలకు 9347211537నంబరుతో సంప్రదించ వలెను.

సెప్టెంబర్ 10, 2021

కథలు, కవితల పోటీల ఫలితాలుః సహరి

Posted in కథల పోటీలు, కవితల పోటీలు at 3:27 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

సెప్టెంబర్ 8, 2021

చిన్న కథానికల పోటీ ఫలితాలుః రంజని

Posted in కథల పోటీలు at 7:07 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం రంజని మిత్రులు సౌజన్యంతో

రంజని తెలుగు సాహితీ సమితి

ఈ ఏడాది జూన్ నెలలో రంజని తెలుగు సాహితీ సమితి నిర్వహించిన చిన్న కథానికల పోటీ – 2021 ఫలితాలు ప్రకటన.

చిన్న కథానికల పోటీలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా రచయితలు, రచయిత్రులు ఈ పోటీలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు.
ఈ పోటీకి రెండువందల కథానికలు అందాయి. పోటా పోటీగా ఉన్న కథానికల దృష్ట్యా, ముందు ప్రకటించినట్లు పది బహుమతులు మాత్రమే కాక మరో అయిదు బహుమతులను కూడా ప్రకటించడం జరుగుతోంది. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ రచయిత డాక్టర్ పాలకోడేటి సత్యనారాయణ రావు గారు వ్యవహరించారు.
బహుమతి పొందిన కథానిక, వాటి రచయిత పేర్లు ఈ విధంగా ఉన్నాయి.

సర్వశ్రీ/ శ్రీమతి
1 బంధం .. N.L.J.రాణి
2 సంస్కృతి .. M.సుగుణ రావు
3 కాపరి .. V.N.మంజుల
4 జీవితమంటే ఇదే కదా .. కడియాల ప్రభాకర్
5 సరస్వతి నమస్తుభ్యం .. పెనుమాక నాగేశ్వర రావు
6 ఈ నాన్నను క్షమిస్తావు కదూ … G.N.V.సత్యనారాయణ
7 హే రామ్ .. బులుసు సరోజినీ దేవి
8 నాన్న .. నంద త్రినాథ రావు
9 పెద్దగీత -చిన్నగీత .. కొత్తపల్లి ఉదయబాబు
10 స్టేటస్ .. CH శివరామ ప్రసాద్
11 పురుష ప్రయత్నం .. మల్లాది హనుమంత రావు
12 నీవుంటే వేరే కనులెందుకు .. సూర్య ప్రసాద రావు
13 తెల్ల చీకటి .. వడలి రాధాకృష్ణ
14 మస్తాన్ రెడ్డి .. RC కృష్ణ స్వామి రాజు
15 వాక్సిన్ .. A.ఉమ

బహుమతి పొందిన కథకులతో పాటు, పాల్గొన్న రచయిత/ రచయిత్రులందరికీ కృతఙ్ఞతలు.
బహుమతి మొత్తం ప్రతి కథానిక కు రూ.500/- త్వరలో అందచేయడం జరుగుతుంది.
రంజని కార్యవర్గం

సెప్టెంబర్ 7, 2021

గురుభ్యోనమ: – ప్రతిలిపి

Posted in కథల పోటీలు, కథాజాలం, సాహితీ సమాచారం at 6:12 సా. by వసుంధర

లంకె

గురుభ్యోనమః

నమస్తే,

ఈ నెల మూడ్ ఆఫ్ ది మంత్ లో భాగంగా గురుభ్యోనమః అనే పోటితో ప్రతిలిపి మీ ముందుకు వచ్చింది. మనకు విద్యాబుద్దులు ,సంస్కారాన్ని నేర్పి, విజ్ఞానాన్ని  పెంపొందించి, మంచి పౌరులుగా తీర్చిదిద్దేది గురువులే. తల్లిదండ్రుల తర్వాత  ఎక్కువగా మన సమయాన్ని మన గురువుల దగ్గరే గడుపుతాము. గురువులు దైవ సమానులు, అందుకే ఆచార్య దేవోభవ అంటారు. అంధకారంలో ఉన్న జీవితాలను వెలుగులోకి నడిపించే గురువులు చాల మంది ఉన్నారు. మరి గురువులకు సంబంధించిన, మీ జీవితంలో జరిగిన, మీరు చూసిన, మీరు ఉహించుకున్న సంఘటనలను కథలుగా రాసి మీకు ఇష్టమైన గురువులకు అంకితం ఇవ్వండి.

మీరు మీ కథలను స్వీయప్రచురణ చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించగలరు.

మీ రచనను స్వీయప్రచురణ చేయడానికి మీ ప్రొఫైల్ లో వెళ్ళి వ్రాయండి మీద క్లిక్ చేసి,కొత్తరచనను జోడించండి. శీర్షిక రాసి సంగ్రహం జతచేసి రచనను కొనసాగించి ప్రచురించండి. ఫోటోగ్యాలరీలో మీ కథకు తగ్గ ఫోటోని జోడించి, “విభాగం” అనే చోట “కథ” సెలెక్ట్ చేసి, వర్గం  అనే చోట “గురుభ్యోనమః” అనే వర్గం తో పాటు మీ కథకు తగ్గ  మరో రెండు వర్గాలను కూడా సెలెక్ట్ చేసి “నేను అంగీకరిస్తున్నాను” అని చివరగా ప్రచురించండి. ఈ పోటీ చివరి తేది ముగియగానే ” గురుభ్యోనమః” అనే వర్గం తీసివేయడం జరుగుతుంది. కావున మీరు ” గురుభ్యోనమః ” అనే వర్గంతో పాటు మరో రెండు వర్గాలను  తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మీ కథలను స్వీయప్రచురణ చేసేటప్పుడు  ” గురుభ్యోనమః ” అనే వర్గాన్ని తప్పకుండా సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేసిన కథలు మాత్రమే పోటీకి తీసుకొనబడతాయి. సంగ్రహం తప్పనిసరిగా జత చేయండి.

సంగ్రహం అంటే ఏమిటి?

మీ కథ ఏ అంశం మీద రాస్తున్నారు మరియు మీ కథ యొక్క పూర్తి సారాంశం మూడు వాక్యాలలో కథ మొదట్లో రాయాలి.

న్యాయనిర్ణేత అందించిన ఫలితాలు ఆధారంగా:-

 1. మొదటి పది మంది రచయితలకు ఉత్తమ రచయితలుగా ప్రతిలిపి ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

1. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది : 6.సెప్టెంబర్.2021

2. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది : 30.సెప్టెంబర్.2021

3. ఫలితాలు ప్రకటించే తేది : 6.అక్టోబర్.2021

నియమాలు :-

 • కథలు మీ స్వంతమై ఉండాలి.
 • ఇది వరకు ప్రతిలిపిలో ప్రచురించిన కథలు పోటీకి స్వీయప్రచురణ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయిన కథలు పోటీకి ప్రచురించవచ్చు.
 • పదహైదు(15) కథల వరకు పోటీకి స్వీయ ప్రచురణ చేయవచ్చు.
 • అక్షరదోషాలు లేకుండా చూసుకోవాలి.

సందేహాలకు :events@pratilipi.com కి మెయిల్ చేయగలరు.

గత పేజీ · తరువాతి పేజీ