ఏప్రిల్ 13, 2021

రెండు ఉగాది వెబ్ సంచికలు

Posted in కథల పోటీలు, కవితల పోటీలు, మన పత్రికలు, సాహితీ సమాచారం at 12:04 సా. by వసుంధర

 1. సహరి

అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 💐💐💐
నూతన సంవత్సర కానుకగా ఈ వారం సహరి మీకు ఉచితంగా అందచేస్తున్నాము. ఈ క్రింద ఇచ్చిన లంకెలో సహరి చదవండి. మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి.

http://guest.sahari.in/1617892600/09-04-2021/

2. కథామంజరి

ఈ క్రింద ఇచ్చిన లంకెలో కథామంజరి చదవండి

www.kathamanjari.in/files/ugadi.pdf

ఏప్రిల్ 12, 2021

ఉగాది ఉత్తమ రచనల పోటీ ఫలితాలుః వంగూరి ఫౌండేషన్

Posted in ఇతర పోటీలు, కథల పోటీలు, కవితల పోటీలు, సాహితీ సమాచారం at 8:58 సా. by వసుంధర

కవితలకు ఆహ్వానం

Posted in కవితల పోటీలు, కవితాజాలం, సాహితీ సమాచారం at 10:23 ఉద. by వసుంధర

తెలుగు కవులకు, కవయిత్రులకు ఆహ్వానం

విరజాజులు సాహితీ వేదిక ద్వారా సాహిత్యంలో ప్రతి ప్రక్రియలోనూ పోటీ నిర్వహిస్తూ కవులను,కవయిత్రును ప్రోత్సహిస్తున్న విషయం అందరికీ తెలిసినదే.
సరికొత్తగా ప్లవనామ ఉగాది సందర్భంగా కవితల పోటీలను నిర్వహిస్తున్నాము.

👉 ఈ నేపథ్యంలో విరజాజులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
ఈ పోటీలకు సందేశాత్మకంగా, సామాజికపరంగా ఉండే విధంగా మీకు నచ్చిన సామాజిక అంశంపై కవితలను పంపవలసినదిగా మనవి చేస్తున్నాము.

👉 ఉత్తమ కవితలకు నగదు బహుమతి, ఈ – సర్టిఫికెట్ ప్రధానం చేయబడును.
👉 పోటీలలో పాల్గొంటున్న ప్రతీ ఒక్కరికీ కూడా e – సర్టిఫికేట్ అందజేయబడును.

🔯 మొదటి బహుమతి -316/-

🔯రెండవ బహుమతి – 216/-

🔯ప్రోత్సహక బహుమతులు 5 x 100 ఇవ్వడం జరుగుతుంది.

నియమాలు

👉 అక్షర దోషాలు లేకుండా యూనికోడ్ లో మాత్రమే మీ కవితలు పంపవలెను.
👉 హామీపత్రం తప్పనిసరిగా జతపరచవలెను.
👉 అనువాద, అనుకరణ.లేదా ఇంతకుముందు ఎక్కడైనా ప్రచురితమైన రచనలు అంగీకరించబడవు.

👉 కవితల నిడివి 30 వాక్యాల లోపు ఉండాలి.

👉 కవిత కింద మీ చరవాణి సంఖ్య మరియు ఈ మెయిల్ ఐడీ తప్పకుండా జతచేయండి.

👉 మీ కవితలను 13 /04/2021 రాత్రి పది గంటల లోపు 8919124445 వాట్సప్ నెంబర్ కి పంపగలరు.

విరజాజులు సాహిత్య వేదిక
రజిత కొండసాని గారు
పుప్పాల కృష్ణ చంద్రమౌళి గారు.
https://chat.whatsapp.com/L7PNhm8j6QD1TSEsUavB8Q

కవితల పోటీ

Posted in కవితల పోటీలు, సాహితీ సమాచారం at 10:21 ఉద. by వసుంధర

1989 లో స్థాపించిన “మానేరు రచయితల సంఘం” సిరిసిల్ల, జిల్లా : రాజన్న.
గత మూడు దశాబ్దాలుగా సిరిసిల్ల ప్రాంతంలో మహాకవి” సినారె” ఆశీస్సులతో సాహిత్య సాంస్కృతిక రంగాలలో విలక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. 1997లో 50 మంది బాల బాలికలతో “స్వర్ణభారతి కి బాలభారతి కవితా నీరాజనం “జరిపింది. వందలాది కార్యక్రమాలతో, ప్రచురణలను చేసింది. ఆ పరంపరలో సామాజిక అంశం తో ప్లవనామ ఉగాది పర్వదినాన్ని
పురస్కరించుకుని మానేరు రచయితల సంఘం Online కవితలు,కవులు/రచయితలకు స్వాగతం పలుకుంతుంది

** కవితలు పంపిన ప్రతీ ఒక్కరికీ ఈ- ప్రశంసా పత్రం (e- certificate) అందజేయబడుతుంది.

నిబంధనలు:

 1. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాయండి అందులో సామాజిక అంశం ఉండాలి.
 2. కవిత 25 నుంచి 30 వాక్యాలలోపు ఉండాలి.
 3. తమ స్వంత రచనని హామీ పత్రం రాయాలి.
  *చివరి తేదీ : 12ఏప్రిల్,2021
  మీ యొక్క కవితలను
  ≈జిందము అశోక్≈
  కార్యనిర్వాహక కార్యదర్శి
  8978532225
  నెంబర్ కు పంపగలరు.
  పోటీలో పాల్గొను వారు ఈ క్రింది లింక్ ద్వారా సమూహంలో జాయిన్ కాగలరు.
  https://chat.whatsapp.com/LIWUqBd23S43Drv0EeXF6v గర్రిపెల్లి అశోక్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎలగొండ రవి ప్రధాన కార్యదర్శి సిరిసిల్ల

ఏప్రిల్ 9, 2021

కథలు, కవితల పోటీలుః సహరి

Posted in కథల పోటీలు, కవితల పోటీలు, సాహితీ సమాచారం at 10:14 ఉద. by వసుంధర

తరువాతి పేజీ