మార్చి 26, 2021

కార్టూన్ పోటీలు- హాస్యానందం

Posted in చిత్రజాలం, బొమ్మల పోటీలు, సాహితీ సమాచారం at 2:26 సా. by వసుంధర

మార్చి 23, 2021

కార్టూన్ పోటీలుః హాస్యానందం

Posted in చిత్రజాలం, బొమ్మల పోటీలు, సాహితీ సమాచారం at 7:26 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం హస్యానందం సౌజన్యంతో

మన కార్టూనిస్టు మిత్రులకు గుర్తుచేస్తున్నా…
మీ ముందున్న ముఖ్యమైన పనులతో పాటు…వీటిపైకూడా దృష్టి పెట్టండి.
1) హాస్యానందం వారి తలిశెట్టిరామారావు కార్టూన్లపోటి..1-4-2021 లోగా పంపాలి.
2) శేఖర్ అవార్డు పోటీకి 1-4-2021 లోగా పంపండి.
3) పోటీ కోసం కాదుగాని.. కరోనా సెకండ్ వేవ్ వస్తున్నట్టుంది..దీనిపై ఎవేర్ నెస్ కలిగించేవి వేసి సమాజానికి ఉపయోగపడేవి వేయండి.
4)21-3-2021 ఆదివారం జరిగిన మన కార్టూన్ల ప్రదర్శనపైన కూడా మీదైన శైలిలో స్పందన తెలుపుతూ ఒక కార్టూను వేసి గ్రూపులో పెట్టండి..

లాల్ వైజాగు 23-3-2021

మార్చి 10, 2021

కార్టూన్ విజేతలకు బహుమతి ప్రదానం

Posted in ఇతర పోటీలు, చిత్రజాలం, బొమ్మల పోటీలు, సాహితీ సమాచారం at 4:45 సా. by kailash

సెప్టెంబర్ 7, 2020

నాటా 2020 సాహిత్య పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు, కవితల పోటీలు, బొమ్మల పోటీలు, సాహితీ సమాచారం at 12:32 సా. by వసుంధర

పై ఫలితాలను ప్రకటిస్తూ నాటా ఈ నెల 5న ఒక సభను నిర్వహించింది. కరోనా కాలంలో అటువంటి సభను – ఒక సాహిత్యసభగా – అర్థవంతంగా, అపూర్వంగా నిర్వహించి సాహిత్యాన్ని గౌరవించడం 2020లో చెప్పుకోతగ్గ విశేషం. పోటీలపై న్యాయనిర్ణేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలు – తెలుగు సాహిత్యానికి ఆశాజనకమూ, ప్రోత్సాహమూనూ. పాల్గొన్నవారు ప్రతిష్ఠాత్మక హోదాల్లో ఉండి కూడా, వినయభూషణులై, హుందాగా – సాహిత్య సభానిర్వహణకు ఆదర్శప్రాయులై సభకు వన్నెలు దిద్దారు. విజేతలకు, నిర్వాహకులకు అభివందన పూర్వక శుభాకాంక్షలు.

ఆ సభావిశేషాలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. చూసేక మీ అభిప్రాయాల్ని తెలియజేస్తే, వారికి ఉత్సాహమూ, ప్రోత్సాహమూ కలిగి – తెలుగు సాహితి మరింతగా శోభించేందుకు దోహదం కాగలదు.