సెప్టెంబర్ 19, 2021

ఆహ్వానంః అంతర్జాలంలో అష్టావధానం

Posted in కవితాజాలం, భాషానందం at 12:40 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహితీ పల్లవం సౌజన్యంతో

అంతర్జాలంలో అష్టావధానం


తెలుగుభాషా సాహిత్య ప్రియులందరూ ఆహ్వానితులే


తేదీ :19_09_2021 సమయం సాయంత్రం:5:00 గంటలకు

అధ్యక్షులు: శ్రీ డా” టి.సురేష్ బాబు

అవధాని: శ్రీ డా” గంగుల నాగరాజు

నిషిద్ధాక్షరి: అవధానం సుధాకర శర్మ

సమస్య: శ్రీ ఆవుల చక్రపాణి యాదవ్

వర్ణన: శ్రీమతి హెచ్ సీతామహాలక్ష్మి

దత్తపది: శ్రీమతి పసుపులేటి నీలిమా

ఆశువు: శ్రీమతి డా” కొమండూరి మారుతీ కుమారి

పురాణ పఠనం: శ్రీమతి డా”దండెబోయిన పార్వతీ దేవి

వ్యస్తాక్షరి: శ్రీమతి: అక్కిరాజు వరలక్ష్మి

అప్రస్తుత ప్రసంగం: శ్రీ డా”గెలివి సహదేవుడు

నిర్వహణ:

శ్రీ గన్నమరాజు సాయిబాబా
అధ్యక్షులు
కర్నూలు జిల్లా తెలుగు రచయితల సంఘం

లైవ్…
Badi pillala talent యూట్యూబ్ చానల్ లో

సెప్టెంబర్ 16, 2021

ఆహ్వానంః అష్టావధానంలో పృచ్ఛకులకు

Posted in భాషానందం, సాహితీ సమాచారం at 9:19 సా. by వసుంధర

నమస్కారము..
 కొత్త అవధానితో కార్యక్రమం అనుకుంటున్నాము. ఇంకా ఖరారు కాలేదు.  అష్టావధానంలో పాల్గొనదలచినవారికి ఆహ్వానము ..  మీరు స్వయంగా పాల్గొనవచ్చు/ మీకు తెలిసినవారికి పంపవచ్చు.

2021 అక్టోబర్ లో  నవరాత్రుల్లో కాకుండా    ఏదో ఒకరోజు .. బహుశా శని/ ఆదివారం   (భారత కాలమానం ప్రకారం 17:10-19:53) ఆన్లైన్ లో జరుగనున్న అష్టావధానం కార్యక్రమానికి ప్రాశ్నికులుగా ఉండదలచినవారు తమ వివరాలను క్లుప్తంగా vikramkumar.volunteer@gmail.com 8331926163 కి పంపగలరు
ప్రస్తుతం 8 మందికి అవకాశం ఉంటుంది.  మీరు ఎలాంటివి అడుగుతారో  రెండు నమూనా ప్రశ్నలు పంపగలరు.
 పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరౌతారు.. కనుక వినతగినవే అడుగవలెను.    హంగూ ఆర్భాటాలు ఉండవు. ఉదాత్తమైన అంశాలతో మొదటి సారి అవధానం చూస్తున్నవారికి ఈ ప్రక్రియ పట్ల కుతూహలం కలిగేలా భాషా సాహిత్యాలపై గౌరవం కలిగేలా నిర్వహించాలని సంకల్పం.

ప్రాశ్నికులకు  నియమాలు..
సమయపాలన చేయవలసి ఉంటుంది.మీకు ఇంటర్నెట్ _ కరెంటు లేకపోవడం వంటి ఇబ్బందులు ఉండరాదు. ఆన్లైన్ లో  పాల్గొనటానికి తగినంత సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉండాలి. 
అనవసర ప్రసంగాలు వలదు(అప్రస్తుత ప్రసంగం చేసేవారు సైతం ఔచిత్యవంతంగా అడుగవలె)
 స్వోత్కర్షలు/ సాగతీత / చౌకబారు వ్యవహారం నిషేధం.

జాతీయ సమైక్యత/  సర్వమానవ సౌభ్రాతృత్వం/  జీవ కారుణ్యం వంటి  ఉదాత్తమైనవిగా ఉండాలి  ప్రశ్నలు / జవాబులు 
మరీ ఎక్కువ మంది తమ వివరాలు పంపితే భవిష్యత్తులో చేసే కార్యక్రమాలకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
 ధన్యవాదములు—-

పద్యాల విక్రమ్ కుమార్ 

8331926163

www.linkedin.com/in/विक्रम-విక్రమ్-vikram-कुमार-కుమార్-kumar-85424172

సెప్టెంబర్ 6, 2021

తెలంగాణా భాషా దినోత్సవ వేడుకలు

Posted in భాషానందం, సాహితీ సమాచారం at 3:30 సా. by వసుంధర

“తానా ప్రపంచ సాహిత్య వేదిక “

( ప్రతి నెలా ఆఖరి ఆదివారం – అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం ) 

ప్రజా కవిశ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా

“తెలంగాణా భాషా దినోత్సవ వేడుకలు”

గురువారం, సెప్టెంబర్ 9, 2021(భారత కాలమానం – 7:30 PM;

అమెరికా – 7:00AM PST; 9:00AM CST; 10:00 AM EST) 

“తెలుగు సాహిత్య చరిత్రలో సరికొత్త కోణం”

లబ్ద ప్రతిష్ఠులైన  సాహితీవేత్తల జీవన ప్రస్థానాన్ని వారి కుటుంబ సభ్యులే ఆవిష్కరించే అపూర్వ ఘట్టం     

అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.  

 ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు: 

1. TANA TV Channel – in YuppTV

2. Facebook: https://www.facebook.com/tana.org

3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw

4. www.youtube.com/tvasiatelugu

5. www.youtube.com/manatv  

మిగిలిన వివరాలకు: www.tana.org

ఆగస్ట్ 29, 2021

నాణెం పై తెలుగు భాష

Posted in భాషానందం at 12:56 సా. by వసుంధర

ఈ టపా పలుమార్లు సాంఘిక మాధ్యమాల్లో వచ్చినప్పటికీ – తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా నేడు మరోసారి స్మరించుకుంటున్నాం.

ఇక్కడో చిన్న మాటః తెలుగు భాష గొప్పతనం గురించీ, తెలుగునెలా కాపాడుకోవాలనే సూచనలూ- మనం అదేపనిగా వింటున్నాం. తెలుగు భాషాదినోత్సవ సభల్లో పాల్గొనేవారు సమాజంలో ప్రముఖులో, లబ్దప్రష్ఠులో ఐతే చాలదు. తెలుగుకోసం వారు ఇంతవరకూ ఏంచేశారో చెప్పాలి. అలా చేసినవారే సభల్లో పాల్గొనాలి. లేకుంటే అవి ఊకదంపుడు ఉపన్యాసాలే ఔతాయి. వాటిని పదే పదే విని విసిగి ఉన్నాం మరి!

వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులు సౌజన్యంతో

ఇంగ్లీష్ వాళ్ళు మన తెలుగు భాషకు పట్టం కట్టారు.

ఒకసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. గాంధీజీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ వల్లభాయి పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహా మేధావి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పట్టాభి సీతారామయ్య గారు ” ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య ” ను సభ దృష్టికి తీసుకువచ్చారు.

పట్టాభీ ! నువ్వు ‘ ఆంధ్ర రాష్ట్రం,,, ఆంధ్ర రాష్ట్రం,,, ‘ అని ఎప్పుడూ అంటూ ఉంటావు… అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా ? … మీరంతా ‘మద్రాసీ’లు కదా ? అంటూ పటేల్ గారు ఎగతాళిగా మాట్లాడారు.

అప్పుడు వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి అణా కాసును తీసి ” సర్ధార్ జీ ! దీనిపై ‘ ఒక అణా ‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ … జాతీయ భాష అయిన హిందీలోనూ … దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీలోనూ… ఆ తర్వాత ‘ ఒక అణా ‘ అని తెలుగులోనూ రాసి ఉంది. ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అణా నాణెం.

(అప్పటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు)… మరి ఈ నాణెం పై మా ‘ తెలుగు భాష ఉంది… కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే ???

అంటూ చురక వేశారు. పటేల్ గారు ఆశ్చర్యపోయారు.

భారత దేశానికి స్వతంత్రం రాక ముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను పరిపాలించే రోజుల్లోనే… తెలుగు భాషకున్న ప్రాచీనతను గొప్పదనాన్ని గుర్తించి, వారు ముద్రించిన నాణెల మీద అధికార భాష ఇంగ్లీషు, జాతీయ భాష హిందీ, ప్రపంచం లో అధికంగా మాట్లాడే బెంగాలీ భాష, తెలుగు భాష లను ప్రవేశ పెట్టి, మన తెలుగు చరిత్ర గొప్పదనం అందరికి తెలియపర్చారు.

💐💐💐💐💐
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

జూలై 30, 2021

తెలుగు భాష/చరిత్ర పుస్తకాలు ఉచితంగా

Posted in భాషానందం at 11:40 ఉద. by వసుంధర

*తెలుగు భాష/తెలుగు చరిత్ర సంబంధ 23  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*————————————————తెలుగు భాషా చరిత్ర www.freegurukul.org/g/Telugu-1
ఆంధ్ర భాషా వికాసము www.freegurukul.org/g/Telugu-2
తెలుగు కోర్స్ www.freegurukul.org/g/Telugu-3
భాషాశాస్త్ర మూల సూత్రాలు www.freegurukul.org/g/Telugu-4
బాష www.freegurukul.org/g/Telugu-5
తెలుగు వాక్యం www.freegurukul.org/g/Telugu-6
చక్కని తెలుగు వ్రాయడం ఎలా www.freegurukul.org/g/Telugu-7
ద్రావిడ భాషా పరిశీలనము-2 www.freegurukul.org/g/Telugu-8
ముప్పది రోజులలో తెలుగు www.freegurukul.org/g/Telugu-9
వ్యవహారిక భాషా వికాసం www.freegurukul.org/g/Telugu-10
సామాన్య భాషా శాస్త్రం www.freegurukul.org/g/Telugu-11
భాషా చారిత్రిక వ్యాసావళి www.freegurukul.org/g/Telugu-12
తెలుగు భాషా భోదన ప్రణాళిక www.freegurukul.org/g/Telugu-13
పరమ లఘు మంజూష www.freegurukul.org/g/Telugu-14
ఆంధ్ర భాషా చరిత్రము www.freegurukul.org/g/Telugu-15
మన భాష www.freegurukul.org/g/Telugu-16
మాతృ భాషా భోదన www.freegurukul.org/g/Telugu-17
ఆంధ్ర సాహిత్య చరిత్ర www.freegurukul.org/g/Telugu-18
ఆంధ్ర బాషా వికాసం www.freegurukul.org/g/Telugu-19
ఆంధ్ర భాషా చరిత్రము-1,2 www.freegurukul.org/g/Telugu-20
అధికార భాష – తెలుగు చరిత్ర www.freegurukul.org/g/Telugu-21
భారతీయ సాహిత్య సంకలనము www.freegurukul.org/g/Telugu-22
అధికార భాష తీరుతెన్నులు www.freegurukul.org/g/Telugu-23
ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను ప్రతి రోజు పొందుటకు:Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukulWhatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

తరువాతి పేజీ