ముందుమాట

అక్షరజాలం బ్లాగుని చేరడానికి లంకెలుః

 1. http://vasumdhara.com/
 2. https://vasumdhara.com/

వసుంధర రచనలు, ఆసక్తి కరమైన ఇతరుల రచనలు – అంతర్జాలంలో ఆకర్షణీయంగా ప్రచురిస్తున్న సుకథ వెబ్‍సైట్‍ కి ఈ క్రింద లంకెలు ఇస్తున్నాము. పాఠకులు, రచయితలు ‘సుకథ’ సదుపాయాన్ని అందుకోగలరు.

https://www.sukatha.com/

https://www.sukatha.com/author/vasundhara

App Links:

Android: https://play.google.com/store/apps/details?id=com.sukatha

IOS: https://itunes.apple.com/us/app/sukatha/id1286552286?ls=1&mt=8

ఇప్పుడు ఈ బ్లాగు http://www.vasumdhara.com కి అనుబంధంగా ఉంటున్నది. వీక్షకులు, పాఠకులు గమనించగలరు.

కథలైనా కవితలైనా పాటలైనా పలుకులైనా నాటికలైనా నాదాలైనా- అక్షరాలతో ఊపిరి పోసుకుని అక్షరజాలంతో అర్థవంతమౌతాయి. మేము ప్రత్యేకంగా ఆరాధించే కథనీ, ఆ కథతో విడదీయరాని అనుబంధమున్న ఇతర సాహితీ ప్రక్రియల్నీ విశ్లేషించే సాహితీ సుధా కథా వేదిక- ఈ అక్షరజాలం. సాహిత్యం-సాహితీపరులు, కళలు-కళాకారులు, పత్రికలుపాత్రికేయులు, బుల్లితెరవెండితెర, సాంఘికం-రాజకీయం వగైరాలు- జాతీయంగా, అంతర్జాతీయంగా తొక్కిన పాతపుంతలు, తొక్కుతున్న నేటిపుంతలు, తొక్కనున్న కొత్తపుంతలు మన చర్చనీయాంశాలు. మా అవగాహన మేరకు తెలుగువారికీ, తెలుగు భాషకీ, తెలుగుతనానికీ ప్రాధాన్యమిచ్చినా- అభిజ్ఞులకీ వేదిక జాతి మత కుల భాషా వర్గ భేదాలకు అతీతమని మనవి. విమర్శకు సదుద్దేశ్యం, వినూత్న ప్రయోగాలకి చొరవ, ఉన్న మాట చెప్పడానికి ధైర్యం, అన్న మాట ఆకళింపు చేసుకుందుకు సహనం ముఖ్యమని గ్రహించిన సహృదయులకు తెలుగునాట కొదవలేదు. ఈ అక్షరజాలానికి రసపుష్టినివ్వాల్సిందిగా వారందరికీ మా విన్నపం.

సాహితీ సమాచారం  సాహితీవైద్యం  పుస్తకాలు   మన కథకులు   మన పత్రికలు మన పాత్రికేయులు  విద్యావేత్తలు  వసుంధర   Flat Forum

210 వ్యాఖ్యలు »

 1. తెలంగాణేతరులు పాల్గొన వచ్చా?

 2. madhukar vydhyula said,

  తెలంగాణ రాష్ట్రస్థాయి కవితల పోటీలు-2020
  ———————————–

  ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రస్థాయిలో పాఠశాల విద్యార్థులకు, జనరల్ విభాగాలకు వేర్వేరుగా వచన కవితల పోటీలు నిర్వహిస్తున్నాము.

  పదవతరగతి లోపు విద్యార్థులకు అంశం- అన్నదాత సుఖీభవ
  జనరల్ విభాగానికి అంశం- నేను చూసిన తెలంగాణ
  నిబంధనలు: కవితలు 20 లైన్లకు మించరాదు. మాకు వచ్చిన కవితల్లో ఉత్తమ మైన ఐదు కవితలను రెండు విభాగాల్లో వేర్వేరుగా ఎంపిక చేసి సమాన బహుమతులు అందజేస్తాము. కవిత పంపేవారు కవిత తమ స్వంతమనే హామీ పత్రంతో పాటు, పాస్ పోటో జతచేసి ఏ4 పేపరుకు ఒకవైపు మాత్రమే రాసికానీ, డిటిపి చేసి కానీ పంపవచ్చు. విజేతల వివరాలను పత్రిక, మొబైల్ ద్వారా తెలియజేస్తాము. విజేతలకు సంస్థ వార్షిక ఉత్సవాల్లో బహుమతులు అందజేస్తాం. కవితలు మాకు చేరాల్సిన చివరితేది మార్చి-20. పోటీల నిర్వహణలో తుది నిర్ణయం నిర్వహకులదే.

  కవితలు పంపాల్సిన చిరునామా
  —————————
  చదువు వెంకటరెడ్డి , కరస్పాండెంట్, ఆఫిల్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్,
  గ్రా.మం॥కమాన్ పూర్
  పెద్దపల్లి జిల్లా -505188
  సంప్రదించాల్సిన పోన్ 9182777409,9989078568,9849950188

  మధుకర్ వైద్యుల కట్కూరిశంకర్ చదువు వెంకటరెడ్డి గుడికందుల భూమయ్య
  వ్యవస్థాపకులు వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులు ప్రధానకార్యదర్శి


Leave a Reply