ముందుమాట
అక్షరజాలం బ్లాగుని చేరడానికి లంకెలుః
వసుంధర రచనలు, ఆసక్తి కరమైన ఇతరుల రచనలు – అంతర్జాలంలో ఆకర్షణీయంగా ప్రచురిస్తున్న సుకథ వెబ్సైట్ కి ఈ క్రింద లంకెలు ఇస్తున్నాము. పాఠకులు, రచయితలు ‘సుకథ’ సదుపాయాన్ని అందుకోగలరు.
https://www.sukatha.com/author/vasundhara
App Links:
Android: https://play.google.com/store/apps/details?id=com.sukatha
IOS: https://itunes.apple.com/us/app/sukatha/id1286552286?ls=1&mt=8
ఇప్పుడు ఈ బ్లాగు http://www.vasumdhara.com కి అనుబంధంగా ఉంటున్నది. వీక్షకులు, పాఠకులు గమనించగలరు.
కథలైనా కవితలైనా పాటలైనా పలుకులైనా నాటికలైనా నాదాలైనా- అక్షరాలతో ఊపిరి పోసుకుని అక్షరజాలంతో అర్థవంతమౌతాయి. మేము ప్రత్యేకంగా ఆరాధించే కథనీ, ఆ కథతో విడదీయరాని అనుబంధమున్న ఇతర సాహితీ ప్రక్రియల్నీ విశ్లేషించే సాహితీ సుధా కథా వేదిక- ఈ అక్షరజాలం. సాహిత్యం-సాహితీపరులు, కళలు-కళాకారులు, పత్రికలు–పాత్రికేయులు, బుల్లితెర–వెండితెర, సాంఘికం-రాజకీయం వగైరాలు- జాతీయంగా, అంతర్జాతీయంగా తొక్కిన పాతపుంతలు, తొక్కుతున్న నేటిపుంతలు, తొక్కనున్న కొత్తపుంతలు మన చర్చనీయాంశాలు. మా అవగాహన మేరకు తెలుగువారికీ, తెలుగు భాషకీ, తెలుగుతనానికీ ప్రాధాన్యమిచ్చినా- అభిజ్ఞులకీ వేదిక జాతి మత కుల భాషా వర్గ భేదాలకు అతీతమని మనవి. విమర్శకు సదుద్దేశ్యం, వినూత్న ప్రయోగాలకి చొరవ, ఉన్న మాట చెప్పడానికి ధైర్యం, అన్న మాట ఆకళింపు చేసుకుందుకు సహనం ముఖ్యమని గ్రహించిన సహృదయులకు తెలుగునాట కొదవలేదు. ఈ అక్షరజాలానికి రసపుష్టినివ్వాల్సిందిగా వారందరికీ మా విన్నపం.
సాహితీ సమాచారం సాహితీవైద్యం పుస్తకాలు మన కథకులు మన పత్రికలు మన పాత్రికేయులు విద్యావేత్తలు వసుంధర Flat Forum
ryaliprasad1@gmail.com said,
ఆగస్ట్ 7, 2020 at 9:05 ఉద.
Please send the competitions details through email Tq
vadapalli poorna kameswari said,
జూన్ 20, 2020 at 10:50 ఉద.
స్వాతి అనిల్ అవార్డు నవలల పోటీలు మరియు కధల పోటీల వివరాలు తెలిస్తే తెలుపగలరు. పొడిగింపు తేదీ ఏమైనా వచ్చినదా. దయచేసి తెలుపగలరు
వసుంధర said,
జూలై 25, 2020 at 11:43 ఉద.
ప్రస్తుతం స్వాతి రావడం లేదు.